లైగర్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనన్యా పాండే.బాలీవుడ్ లో యువ హీరోయిన్ గా సూపర్ ఫాం లో ఉన్న అనన్యా పాండే లైగర్ సినిమాలో ఛాన్స్ రావడం లక్కీ అని అనుకుంది.
కానీ ఆ సినిమా రిజల్ట్ అమ్మడికి షాక్ ఇచ్చింది.లైగర్ హిట్ అయితే ఎలా ఉండేదో కానీ ప్రస్తుతం అనన్యాకి తెలుగు ఆఫర్లు మాత్రం కష్టమే అని చెప్పొచ్చు.
అయితే బాలీవుడ్ లో మాత్రం అనన్యా పాండే వరుస సినిమాలు చేస్తుంది.లైగర్ బ్యూటీ సినిమాలతో సంబందం లేకుండా రకరకాల ఫోటోస్ తో అలరిస్తుంది.
లేటెస్ట్ గా ట్రెండీ లుక్ తో అనన్యా అదరగొట్టింది.బ్లాక్ అండ్ వైట్ స్టైలిష్ డ్రెస్ లో అమ్మడు ఆకట్టుకుంటుంది.గ్లామర్ షో విషయంలో కూడా అమ్మడు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంది.ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న అనన్యా పాండే తెలుగులో మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది.
లైగర్ లో విజయ్ కి పర్ఫెక్ట్ జోడీ అనిపించిన అనన్యా తన టాలెంట్ తో మెప్పించడానికి సిద్ధమైంది.మరి అమ్మడికి ఇక మీదట అయినా లక్ కలిసి వస్తుందేమో చూడాలి.
సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా అనన్యా సందడి చేస్తుంది.