మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హల్ చల్ చేశారు.మునుగోడుకు వెళ్లిన ఆయనను ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు.
దీంతో అధికారులపై కేఏ పాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తాను కాబోయే సీఎంనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్ద పెద్ద వాళ్లంతా తన ఫాలోవర్స్ అని చెప్పారు.అలాంటిది తన వాహనాన్నే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నికలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.







