వీడియో: నాటు నాటు సాంగ్‌కి జపనీస్ లేడీ యూట్యూబర్ అదిరిపోయే డ్యాన్స్..

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాగా క్రేజ్ తెచ్చుకుంది.ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా హిట్ అయింది.

 Video: Japanese Lady Youtuber Dances To Natu Natu Song. Viral Video, Japanese Yo-TeluguStop.com

తర్వాత ఇప్పుడు ఈ మూవీ క్రేజ్ జపాన్‌కు చేరుకుంది.ఈ మూవీ అక్టోబర్ 21న జపాన్ దేశంలో విడుదలైంది.

ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ కి కూడా వెళ్లారు.కాగా తాజాగా ఆ దేశంలో కూడా ‘నాటు నాటు’ పాట హిట్ అయ్యింది.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ జపనీస్ యూట్యూబర్ మాయో ఇటీవల ఈ పాటకు ఐకానిక్ స్టెప్స్‌ను రీక్రియేట్ చేసి.ఈ హిట్ పాట పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది.

ఈ యూట్యూబర్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది.ఇంటర్వ్యూ తర్వాత ఆమె “నాటు నాటు”లో డ్యాన్స్ చేసి అదరగొట్టింది.

వీడియోను షేర్ చేస్తూ, “జపాన్‌లో ఆర్ఆర్ఆర్ విడుదల సందర్భంగా చెర్రీ, తారక్, రాజమౌళిని ఇంటర్వ్యూ చేశాను.ఆపై ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ వీడియో చేశాను.” అని ఆమె చెప్పుకొచ్చింది.కాగా ఇప్పుడు ఆమె డ్యాన్స్ వీడియో ఇండియా లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో మాయో తన స్నేహితురాలు కాకేటాకుతో కలిసి డ్యాన్స్ చేస్తోంది.చాలా ఉత్సాహంతో మంచి ఎక్స్ ప్రెషన్స్ తో ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టింది.ఒక తెలుగు సినిమా ప్రపంచ దేశాల్లో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని.అందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.మాయో చాలా ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేయడం, చిరునవ్వుతో ఎంజాయ్ చేయడం చూసి మరికొందరు ఫిదా అవుతున్నారు.ఈ క్యూట్ వీడియోని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube