సోషల్ మీడియాలో వైరలయ్యే కొన్ని వీడియో చూస్తే మనం అవాక్కవ్వక తప్పదు.ముఖ్యంగా జంతువులు, పురుగులు తదితర వాటికి సంబంధించిన వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్య పరుస్తున్నాయి.
తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక కప్ప మిణుగురు పురుగుని మింగేసింది.
అయితే ఆ పురుగును ఈ కప్ప నమలకుండా మింగడంతో అది కడుపులోకి పోయిన తర్వాత కూడా బతికే ఉంది.దాంతో అది మెరుస్తూ ఉండగా కప్ప పొట్ట లోపలి నుంచి ఆ మెరుపు కనిపించింది.
ఇది చూసేందుకు చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపించింది.
ఈ అమేజింగ్ వీడియోని @fasc1nate అని ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది.
షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకి ఇప్పటికే 31 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.అలానే 83 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక గోడపై కప్ప ఉండటం చూడవచ్చు.ఈ కప్ప పొట్ట భాగంలో ఒక మెరుపు వెలుగుతూ మలుగుతూ ఉంది.
కప్ప కింద ఏదైనా లైట్ ఉందా అని అనుకుంటే అది పొరపాటే.ఎందుకంటే ఈ కప్ప కదిలినప్పుడు కూడా దాని పొట్టలో వెలుగు వచ్చింది.
ఈ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.అయితే కొందరు పాపం మిణుగురు పురుగు కాసేపట్లో చనిపోతుంది అని అంటుంటే.మరికొందరు మాత్రం ఈ పురుగులో ఉండే ఒక విష పదార్థం కప్పను కూడా చంపేస్తుంది అని విచారం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.