మిణుగురు పురుగును మింగిన కప్ప.. దాని పొట్ట ఎలా మెరుస్తుందో చూడండి!

సోషల్ మీడియాలో వైరలయ్యే కొన్ని వీడియో చూస్తే మనం అవాక్కవ్వక తప్పదు.ముఖ్యంగా జంతువులు, పురుగులు తదితర వాటికి సంబంధించిన వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్య పరుస్తున్నాయి.

తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక కప్ప మిణుగురు పురుగుని మింగేసింది.

అయితే ఆ పురుగును ఈ కప్ప నమలకుండా మింగడంతో అది కడుపులోకి పోయిన తర్వాత కూడా బతికే ఉంది.

దాంతో అది మెరుస్తూ ఉండగా కప్ప పొట్ట లోపలి నుంచి ఆ మెరుపు కనిపించింది.

ఇది చూసేందుకు చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపించింది.ఈ అమేజింగ్ వీడియోని @fasc1nate అని ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది.

షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకి ఇప్పటికే 31 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

అలానే 83 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోలో ఒక గోడపై కప్ప ఉండటం చూడవచ్చు.

ఈ కప్ప పొట్ట భాగంలో ఒక మెరుపు వెలుగుతూ మలుగుతూ ఉంది.కప్ప కింద ఏదైనా లైట్‌ ఉందా అని అనుకుంటే అది పొరపాటే.

ఎందుకంటే ఈ కప్ప కదిలినప్పుడు కూడా దాని పొట్టలో వెలుగు వచ్చింది. """/"/ ఈ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

అయితే కొందరు పాపం మిణుగురు పురుగు కాసేపట్లో చనిపోతుంది అని అంటుంటే.మరికొందరు మాత్రం ఈ పురుగులో ఉండే ఒక విష పదార్థం కప్పను కూడా చంపేస్తుంది అని విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.