ఏ కథ ఎవరి దగ్గరకు చేరుతుందో చెప్పడం కష్టం.ఒక డైరెక్టర్ ఒక హీరో కోసమని కథ రాసుకుంటే ఆ హీరోతో చేయడానికి కుదరక ఆ కథ మరొక హీరో దగ్గరికి కూడా తీసుకు వెళ్తాడు.
ఇలా ఎన్నో హీరోల చేతుల నుండి మారి చివరకు ఒక హీరో దగ్గర ఆగుతుంది.మరి ప్రెజెంట్ మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ కోసం రాసిన కథ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతికి చేరినట్టు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇవి ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
రామ్ చరణ్ కాదు అనుకున్న కథను విజయ్ ఓకే చేసినట్టు టాక్.
మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో? ఆ కథ ఏంటో చూద్దాం.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఈ సినిమా ఘన విజయం అవడంతో వెంటనే అగ్ర డైరెక్టర్ శంకర్ తో తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక చరణ్ ఆర్సీ 15 తర్వాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు అని యూవీ క్రియేషన్స్ వారు చరణ్ బర్త్ డే రోజు అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.కానీ ఈ సినిమా ఆగిపోయింది అంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
చరణ్ ఈయనను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారని వేరే డైరెక్టర్ తో సినిమాకు కమిట్ అవ్వబోతున్నారు అంటూ టాక్ బయటకు వచ్చింది.
అయితే ఇప్పటి వరకు ఇవి రూమర్స్ గానే మిగిలి పోయాయి.కానీ ఇప్పుడు ఇవి నిజమే అని తెలుస్తుంది. లైగర్ సినిమాతో ఊహించని ప్లాప్ ఎదుర్కొన్న విజయ్ ఇప్పుడు తన లైనప్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు.
ఈ క్రమంలోనే ఈయన లైనప్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ పక్కన పెట్టిన గౌతమ్ తిన్ననూరితో విజయ్ సినిమా ఓకే చేసాడట.
మరి ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.