ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో స్థిరపడిన తెలుగు వారు తమ పిల్లలకు మాతృ బాషా అయిన తెలుగును నేర్పేందుకు ఎంతో శ్రమిస్తారు.కొందరు తెలుగు ఎన్నారైలు, తెలుగు సంస్థలు ఏర్పాటు చేసిన తెలుగు పాటశాలలో మన తల్లి బాష నేర్పేందుకుగాను తమ పిల్లలను చేర్చుతుంటారు.
అలా తెలుగు బాషా, సంస్కృతీ, సాంప్రదాయలను మర్చిపోకుండా, భావి తరాలు వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకుంటారు.అయితే సింగపూర్ లోని శ్రీ సాంస్కృతిక కళా సారధి సంస్థ సభ్యులు అక్కడి తెలుగు వారి పిల్లలకు బాషా, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలలో తర్ఫీదు ఇస్తూనే , తెలుగు బాష ఔన్నత్యాన్ని పెంచేలా తెలుగు వారందరూ గర్వపడేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజాగా సింగపూర్ లో ని శ్రీ సాంస్కృతిక కళా సారధి సంస్థ విజయోత్సవ సభకు ముఖ్య అతిధిగా గౌరవనీయులు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.ఈ సభా వేదికగా వెంకయ్య నాయుడు గారికి సంస్థ సభ్యులు ఓ వినతి పత్రాన్ని అందించారు.
అదేంటంటే సింగపూర్ స్కూల్స్ అన్నిటిలో తెలుగు బాషను కూడా మాతృభాషా మాధ్యమంగా చేయలాని, అందుకుగాను భారత ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరారు.కాగా.

సింగపూర్ లో సుమారు 2 శాతం మంది తెలుగు వారు ఉంటున్నారని, ఇప్పటికే వారు తెలుగు బాషను వారి పిల్లలకు నేర్పేలా తర్ఫీదులు ఇస్తున్నారని అయితే ఇతర బాషలకు అక్కడి స్కూల్స్ లో మాతృభాషా మాధ్యమంగా గుర్తింపు దక్కుతోందని, తెలుగు కు కూడా అలాంటి గుర్తింపు దక్కితే ఎంతో మంది తెలుగు విద్యార్ధులకు ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ సభ్యులు కోరారు.శ్రీ సాంస్కృతిక కళా సారధి సంస్థ తో పాటు, కాకతీయ సాంస్కృతిక పరివారం, తెలుగుదేశం ఫోరమ్ ఆఫ్ సింగపూర్ వంటి పలు సంస్థలు కలిసి ఈ విజ్ఞప్తి ని అందించాయి.ఇదిలాఉంటే ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తెలుగు బాష అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి చూసి ఎంతో సంతోషంగా ఉందని, ఈ విషయంపై తప్పకుండా ప్రభుత్వంలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.







