టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం మెగా 154.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.
సినిమాలోని ఒక యాక్షన్ సీక్వెన్స్ ని హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు.ఈ సినిమాలో టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన టైమ్ ని ఫిక్స్ చేశారు చిత్ర బృందం.
అక్టోబర్ 24న ఉదయం 11 గంటల 07 నిమిషాలకు టైటిల్ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు.కాగా ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ తెలుపుతూ మెగాస్టార్కు సంబంధించిన ఒక పోస్టర్ ని విడుదల చేశారు.
ఆ పోస్టులో మెగాస్టార్ చిరంజీవి మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.ఆ పోస్ట్ ని బట్టి చూస్తే ఇక థియేటర్లో మెగా అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం అని అనిపిస్తోంది.
అపోస్తన్ని విడుదల చేస్తూ ఆ పోస్టర్ పై బాస్ వస్తున్నాడు అనే క్యాప్షన్ కూడా రాశారు.

అయితే దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాపై ఈ పోస్టర్ తో అంచనాలు మరింత పెరిగాయి.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో పాటు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.







