వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ క్రమంలో ఆమె రేపు ఉదయం హస్తినాకు పయనం కానున్నారని సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర ఉన్నతాధికారులను షర్మిల కలవనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వంపై సీబీఐకి ఆమె ఇప్పటికే ఫిర్యాదు చేశారు.ఇదే విషయంపై షర్మిల మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.
ఈసారి ఈడీ అధికారులకు లేదా జలశక్తి శాఖకు ఈ విషయంపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.