కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర ఏపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.మంగళవారం కర్నూలు జిల్లాలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ ఏపీలో పరిస్థితులపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
రాష్ట్ర రాజధానికి సంబంధించి అమరావతికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు.ఏపీకి అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేరుస్తామని మాట ఇచ్చారు.
ఈ క్రమంలో తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు .రాహుల్ పాదయాత్ర పై మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసి.
అన్యాయం చేసినా రాహుల్ ఏపీలో పాదయాత్ర చేసే హక్కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక ఇదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసినట్లు తెలిపారు.
అదేవిధంగా రాజధాని విషయంలో వికేంద్రీకరణ పేరిట వైసీపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు.రాజధాని అమరావతికి కేంద్రం కట్టుబడి ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.







