తెలంగాణలో కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్ లో ఎవరిని అడిగినా ఇదే చెబుతారని అన్నారు.
ఎన్నికల కమిషన్, కేంద్రం వారి చేతుల్లో ఉందన్న ధీమాతో మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.మునుగోడులో ముందు గెలిచిన తర్వాత దేశంలో బీజేపీని కేసీఆర్ ఎదుర్కొంటారని తెలిపారు.
ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీదే విజయం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యనించారు.







