అవును… బిగ్ బాస్ సీజన్ 6 ఖచ్చితంగా ఫెయిల్ అయింది.దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ సీజన్ పరమ చెత్త సీజన్ అని బిగ్ బాస్ తనకు తానే స్వయంగా ప్రకటించుకున్నాడు.
ఇంతకన్నా పరమ చెత్త రియాలిటీ షో మరొకటి ఉండదు అని తనకు తానే చెప్పుకోవడం బహుశా మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అయ్యుంటుంది.మరి బిగ్ బాస్ సీజన్ 6 ఫెయిల్ అవ్వడానికి గల ముఖ్య కారణాలు ఏంటో ఒకసారి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సెలక్షన్ ప్రాసెస్

షో ప్రారంభం అవడానికి కొన్ని నెలల ముందే ఇంటి సభ్యుల ఎంపిక కసరత్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.కానీ ఈసారి హడావిడిగా చేశారా లేక ఎవరైతే ఏముంది మనం చెప్పినట్టే నడుచుకుంటారు అనే ధీమాతో చేశారో తెలియదు కానీ పరమ చెత్త ఆటగాల్లను ఆరో సీజన్ కి ఎంచుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.దాంతో అసలు ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకులకు అర్థం కాని దుస్థితి వచ్చింది.
చెత్త టాస్కులు

గత ఆరు సీజన్ లతో పోలిస్తే ఆరవ సీజన్ లో వస్తున్న కొన్ని టాస్కులు మిగతా సీజన్లతో సంబంధం ఉన్నప్పటికీ, కొన్ని టాస్కులు మాత్రం జనాలకు తీవ్ర నిరాశనే మిగిలిస్తున్నాయి.చివరికి ఎలా ఆడాలో కూడా ఇంటి సభ్యులకు తెలియడం లేదు.ఎందుకు ఆడుతున్నామో తెలియక, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేక, కంటెంట్ ఎక్కడ సృష్టించాలో అర్థం కాక సతమతమవుతూ జనాలని పిచ్చోళ్లను చేస్తున్నారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు.
తీరు మార్చుకొని ఇంటి సభ్యులు

ప్రతి వారాంతం నాగార్జున వస్తాడు అనే భయం ఏమాత్రం లేదు ఇంటి సభ్యులకి.ఎన్నిసార్లు చెప్పినా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు.చివరికి ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడమే కాకుండా బిగ్ బాస్ పై నాగార్జున పై కూడా ఏదో ఒక మాట అంటూ జనాలకి చిరాకు తెప్పిస్తున్నారు.ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా కూడా ఇంటి సభ్యులు తమ తీరు మార్చుకోక తప్పు మీద తప్పు చేస్తూ ఉండటం కూడా ఒక రకంగా జనాల్లో విసుగు తెప్పిస్తుంది.
ఎవరు సరిగ్గా ఆడటం లేదు అంటూ బిగ్ బాస్ ఏ స్వయంగా డోరు తెరిచి మరి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోండి అని వార్నింగ్ ఇచ్చే స్థితికి ఆరో సీజన్ దిగజారింది అంటే రానున్న సీజన్స్ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది.ఇక ముందు ముందు ఇలాగె జరిగితే బిగ్ బాస్ తెలుగులో కంటిన్యూ అవ్వడం ఎంతో కష్టం.







