పబ్లిక్ లో రెమ్యునరేషన్ చెప్పేసిన పవన్.. ఇలాంటి గొప్ప హీరోలు ఉన్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోల రెమ్యునరేషన్ కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.ఒక స్టార్ హీరో 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే మరో స్టార్ హీరో 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

 Power Star Pawan Kalyan Reveals His Remuneration Details Here Goes Viral , Power-TeluguStop.com

అయితే పవన్ తాజాగా మాట్లాడుతూ తన సినిమాల రెమ్యునరేషన్ ను వెల్లడించారు.గడిచిన ఎనిమిది సంవత్సరాలలో తాను ఆరు సినిమాలలో నటించానని పవన్ అన్నారు.

ఈ ఆరు సినిమాల కోసం పవన్ 100 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నానని చెప్పారు.ఈ రెమ్యునరేషన్ కు 33.37 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టానని పవన్ వెల్లడించారు.అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో ఆ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ లో చాలా మొత్తాన్ని పవన్ తిరిగిచ్చేశారు.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ హక్కులను కొనుగోలు చేసి టికెట్ రేట్ల వల్ల నష్టపోయిన ఏపీ బయ్యర్లను సైతం పవన్ ఆదుకున్నారని సమాచారం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతల శ్రేయస్సు కోరే అతికొద్ది మంది హీరోలలో పవన్ ఒకరు.

ఇంత గొప్ప హీరోలు అరుదుగా ఉంటారని ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ ఒకరని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలకు భారీ మొత్తంలో లాభాలు వస్తున్నాయి.

అయితే పవన్ మాత్రం తన రెమ్యునరేషన్ లో చాలా మొత్తాన్ని సేవా కార్యక్రమాల కొరకు ఖర్చు చేస్తున్నారు.

Telugu Agnyathavasi, Bhimla Naik, Pawan Kalyan, Tollywood, Vakil Saab-Movie

పవన్ కొన్ని విషయాల్లో చాలా గొప్ప వ్యక్తి అని విలువలతో కూడిన రాజకీయాలు చేసే అతికొద్ది మందిలో పవన్ కళ్యాణ్ ఒకరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ సినిమాల పరంగా ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube