ఆ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో కాంతార.. ఎవరూ ఊహించని స్థాయిలో?

ఇటీవలే తెలుగులో విడుదలైన కాంతారా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా రికార్డుల మీద రికార్డుల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.అంతేకాకుండా ఇది కన్నడ సినిమా అయినప్పటికీ తెలుగులో ఇంతకుముందు విడుదలైన భారీ చిత్రాల కలెక్షన్స్ ను అవలీలగా దాటుకుని దూసుకుపోతోంది.

 Kantara Movie Gets First Place Imdb Ranks All Over India, Kantara, Rrr, Bhahubal-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమాను చూసిన సామాన్యులు సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాను రెండుసార్లు చూశారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కాంతార సినిమా పేరు వినిపిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఐఎండిబి ప్రకటించిన టాప్ 250 ఇండియన్ ఫిలిం జాబితాలో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.

కాగా ఇదే విషయాన్ని తాజాగా ఐఎండీబీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.సెప్టెంబరు 30న పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.రిషభ్ శెట్టి తానే హీరోగా నటించి తానే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంది.

అంతే కాకుండా పెద్ద సినిమాల రికార్డులు సైతం బద్దలవుతున్నాయి.టాలీవుడ్‌లో హిట్‌ చిత్రాలు బాహుబలి: ది కన్‌క్లూజన్101, బాహుబలి: ది బిగినింగ్182 , ఆర్ఆర్ఆర్190 స్థానాల్లో నిలిచాయి.ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌ జాబితాను వెల్లడించగా.

తొలి స్థానంలో కాంతార, రెండవ స్థానంలో రామాయణ, మూడవ స్థానం లో రాకెట్రీ నిలిచాయి.కాగా తమ యూజర్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించినట్లు వెల్లడించింది.

కాగా ఈ సినిమా మలయాళ వర్షన్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా కాంతారా సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube