వెయిట్ తగ్గితే వెయ్యి కోట్ల ఆఫర్

చాలెంజ్ స్వీకరించిన బీజేపీ ఎంపీవెయిట్ లెస్ అయితే వెయ్యి కోట్లు బంపర్ ఆఫర్ అంటూ నితిన్ గడ్కరీ ఛాలెంజ్ విసరగా.ఓ బీజేపీ ఎంపీ ఏకంగా 32 కేజీలు తగ్గారు అంటే నిజమేనా అనే డౌట్ వస్తుంది.

 1000 Crores Offer If You Lose Weight. Weight, Loss, Crores, Income, Viral Lates-TeluguStop.com

అసలు ఏం జరిగింది వెయ్యి కోట్ల ఆఫర్ ఏంది అంటే.మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ పాల్గొన్నారు.మీరు బరువు తగ్గాలి.తగ్గిన ప్రతీ కేజీకి ఉజ్జయినీ అభివృద్ధి కోసం రూ.1000కోట్లు మంజూరు చేస్తామని ఆ నియోజకవర్గం ఎంపీ అనిల్ఫరోజియాతో గడ్కరీ అన్నారు.ఆయన హామీతో 32 కిలోలు తగ్గిన ఉజ్జయినీ ఎంపీ అనిల్ ఫిరోజియా అధిక బరువును వదిలించుకోవడంతో ఆరోగ్యంగా ఉన్నానని, అదే సమయంలో తన నియోజకవర్గాన్ని అభివృద్ధికి నిధులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియాకు ఈ ఏడాది జూన్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ హామీ ఇచ్చారు.

ఒక్క కిలో బరువు తగ్గితే నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఫిట్ ఇండియా పథకం ప్రారంభిస్తూ కేంద్రమంత్రి ఈ హామీ ఇచ్చారు.

దీంతో ఎంపీ ఫిరోజియా కష్టపడి కసరత్తులు చేసి ఇప్పటి వరకు 32 కిలోలు తగ్గారు.గడ్కరీ ఇచ్చిన మాట ప్రకారం తన నియోజకవర్గానికి 32 వేల కోట్లు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని లాంచ్ చేశారు.నేను తగ్గిన ప్రతీ కేజీకి.ఉజ్జయిన్ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు మంజూరు చేస్తామని స్టేజీ మీద నితిన్ గడ్కరీ అన్నారు.నేను ఆ ఛాలెంజ్ తీసుకుని 32కేజీలు తగ్గాను.ఇంకా తగ్గుతాను.నా నియోజకవర్గానికి నిధులువస్తాయంటే.ఇంకా తగ్గుతాను అని అనిల్ ఫిరోజియా తెలిపారు.ఉదయాన్నే 5:30 గంటలకు మేల్కొని మార్నింగ్ వాక్ కు వెళ్లడం, ప్రతిదినం యోగా చేయడంతో పాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా తన అధిక బరువును వదిలించుకున్నట్లు ఎంపీ ఫిరోజియా చెప్పారు

Telugu Bumper, Latest-Latest News - Telugu

.ఉదయం తేలిక పాటి టిఫిన్, మధ్యాహ్నం సలాడ్, కాయగూరలు, చపాతీలతో భోజనం చేశానని తెలిపారు.గతంలో 127 కిలోల బరువున్న తాను ఇప్పుడు 95 కిలోలకు తగ్గానని ఫిరోజియా చెప్పారు.తాను బరువు తగ్గితే నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు వస్తాయంటే మరింత బరువును కోల్పోవడానికి సిద్ధమని ఫిరోజియా స్పష్టం చేశారు.

కాగా ఈ ఛాలెంజ్ స్వీకరించి బరువు తగ్గిన ఫిరోజియా ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కాగా.ఈ నెల 14న నితిన్ గడ్కరీని కలిశారు బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా.బరువు తగ్గిన విషయాన్ని వెల్లడించారు.సంతోషించిన నితిన్గడ్కరీ.ఉజ్జయిన్ అభివృద్ధి కోసం రూ.2,300 కోట్లు విడుదల చేస్తానని హామీనిచ్చినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube