ఇక టచ్ చేసి చూడు.. ఆన్లైన్ లో కోనేయ్..!

ఆన్లైన్ షాపింగ్ ప్రియుల కోసం ఒక అదిరిపోయే అనుభూతిని పొందవచ్చని ఆన్లైన్ లో వస్తువులు బుక్ చేసి అవి వచ్చాక క్వాలిటీ లేదని సరిగా లేవని ఇబ్బందులు పడకుండా ఆన్లైన్ లో షాపింగ్ చేసి మోసపోకూడదనే ఉద్దేశ్యంతో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు.అదేమిటంటే మనం ఆన్లైన్లో వస్తువులు నచ్చిన వస్తువును ఆర్డర్ చేస్తాము.

 Just Touch And See.. Online Online Shopping, Touching Sensor, Technology News,-TeluguStop.com

ఇది జనరల్ గా జరిగే ప్రక్రియ.ఐతే ఇప్పుడు మనం బుక్ చేస్తున్న వస్తువును వేలితో టచ్ కూడా చేయవచ్చట.

, తాకిన అనుభూతిని కూడా పొందవచ్చు.అదెలాగో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మీరు ఈ కామర్స్ సైట్లలో వస్తువులను కొనాలనుకున్నపుడు అది ఎలా ఉంటుందో, ఏమో అని ఎప్పుడైనా అనిపించిందా.అలాంటి వారి కోసం పరిశోధకులు మద్రాస్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓ సాఫ్ట్వేర్ ను రూపొందించారు.

ఈ ఫీచర్ వల్ల సైట్ లో కనిపించే వస్తువులను తాకే అనుభూతిని పొందవచ్చన్నారు.వేలితో వస్తువులను తాకిన చోట మాత్రమే అది ఎలా ఉందన్న విషయాన్ని ఊహించగలమని స్పష్టం చేశారు.

ఇంటరాక్టివ్ టచ్ యాక్టివ్ డిస్ ప్లే కోసం సృష్టించిన ఈ టెక్నాలజీని ‘itad‘ అంటారు.టచ్ డిస్ ప్లే టెక్నాలజీలో ఇది తరువాతి తరానికి చెందిందని మద్రాస్ ఐఐటీ పేర్కొంది.

ఇది ఐటాడ్ యుగమని ఈ సాంకేతికత ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకెళుతుందని అప్లైడ్ మెకానిక్స్ విభాగానికి చెందిన ప్రధాన పరిశోధకుడు అన్నారు.ఈ కామర్స్ ప్లాట్ ఫార్మల నుండి కొనుగోలు చేసే ముందు వాటిని తాకవచ్చు, అనుభూతి చెందవచ్చని చెప్పారు.

సాంకేతికతను అభివృద్ధి చేయడానికి టచ్ టాబ్స్ పరిశోధకులు, మెర్కెల్ హాప్టిక్స్ కలిసి పనిచేయనున్నారు.ఈ పరికరాన్ని మరింత చిన్న సైజులో.

అంటే కంప్యూటర్ మౌస్ తరహా పరికరాన్ని రూపొందించడమే తమ లక్ష్యమని ఇదే మాట కంపెనీ సీఈవో డాక్టర్ పీవీ పద్మప్రియ చేప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube