నా భార్యలకు అన్ని రూ.కోట్ల భరణం ఇచ్చా.. పవన్ సంచలన వ్యాఖ్యలు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయాలని అనుకుంటే చాలామంది రాజకీయ నాయకులు ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తున్నారు.

 Pawan Kalyan Sensational Comments About His Ex Wifes Details Here ,pawan Kalyan-TeluguStop.com

అయితే వైవాహిక జీవితంలో ఇబ్బందుల వల్లే తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ గతంలోనే వెల్లడించారు.అయితే విమర్శలు రిపీట్ అవుతుండటంతో పవన్ తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన మూడు పెళ్లిళ్ల గురించి పదే పదే విమర్శలు రావడంతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని పదేపదే మాట్లాడుతున్నారని నేను విడాకులు ఇచ్చిన తర్వాతే మరో పెళ్లి చేసుకున్నానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.చట్ట ప్రకారం నేను భరణం చెల్లించానని పవన్ కళ్యాణ్ అన్నారు.

మొదటి భార్య నందినికి 5 కోట్ల రూపాయల భరణం ఇచ్చానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం గమనార్హం.

రెండో భార్యకు ఆస్తి రాసిచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ విడాకుల గురించి, తన భార్యలకు ఇచ్చిన భరణం గురించి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా విమర్శలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన, చంద్రబాబు టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

వైసీపీపై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా వైసీపీ మంత్రులు సైతం రివర్స్ లో కౌంటర్లు ఇస్తున్నారు.

Telugu Alimony, Chandrababu, Jana Sena, Nandini, Pawan Kalyan, Pawankalyan-Movie

ప్యాకేజీ స్టార్ అని కామెంట్లు చేసేవాళ్లకు సైతం పవన్ కళ్యాణ్ ధీటుగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం.పవన్ కళ్యాణ్ విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు సైతం మండిపడ్డారు.అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందని రాబోయే రోజుల్లో కలిసి కార్యక్రమాలు చేద్దామని చంద్రబాబు వెల్లడించారు.2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube