టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు ఎంతో డిఫరెంట్ గా ఉంటూ ఈమె సినిమా కథలను ఎంపిక చేసుకొని ఎలాంటి గ్లామర్ షో చేయకుండా అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
ఇకపోతే విరాటపర్వం సినిమా తర్వాత ఈమె ఎలాంటి సినిమాలను ప్రకటించకుండా ఉండడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి సినిమాల ఎంపిక గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ తాను సినిమాల ఎంపిక విషయంలో హీరోల గురించి ఏమాత్రం ఆలోచించనని తను కథకు ప్రాధాన్యత తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేస్తానని తెలిపారు.ముందుగా నాకు కథ చెప్పడానికి దర్శక నిర్మాతలు వస్తే హీరో ఎవరు అనే ప్రశ్న తాను అడగను అని తెలిపారు.
తన దృష్టిలో స్టార్ హీరో అయిన ఇతర హీరోలైన కథ ప్రాధాన్యతే ముఖ్యమని తెలిపారు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె టాలీవుడ్ హీరోలపై కూడా ప్రశంసలు కురిపించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన చేసే డాన్స్ చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోతానని తెలిపారు.సాయి పల్లవి కూడా స్వతహాగా ఎంతో అద్భుతమైన డాన్సర్ ఈమె డాన్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.అలాంటిది సాయి పల్లవికి అల్లు అర్జున్ డాన్స్ అంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే తన సినీ కెరియర్లో తనకు లవ్ స్టోరీ,ఫిదా సినిమాలంటే ఎంతో ప్రత్యేకమని ఇలాంటి అద్భుతమైన సినిమాలను అందించిన శేఖర్ కమ్ముల గారికి ఎప్పుడు కృతజ్ఞరాలని అంటూ తెలిపారు.







