బిగ్ బాస్ సీజన్ 6 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ ఎవరు అంటే రేవంత్ అని చెప్పొచ్చు.ఇండియన్ ఐడల్ విన్నర్ గా రేవంత్ కి సూపర్ ఫాలోయింగ్ ఉంది.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6లో రేవంత్ తన ఆటతో అందరిని మెప్పిస్తున్నాడు.అయితే ఆట విషయంలో సూపర్ అనిపించుకుంటున్నా అతని మాటల వల్ల హౌస్ మెట్స్ కొందరు హర్ట్ అవుతున్నారు.
అదే అతనికి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.ఏదైనా విషయాన్ని హౌస్ మెట్స్ తనకు చెబితే ఒప్పుకోడు అందుకే అతన్ని ప్రతి వారం నామినేషన్స్ లో ఉంచుతున్నారు.
అతనికి ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ తో టాప్ ఓటింగ్స్ తో సేవ్ అవుతున్నాడు.

ఇక లేటెస్ట్ గా ఏడవ వారం నామినేషన్స్ లో కూడా రేవంత్ నామినేట్ అయ్యాడు.లాస్ట్ వీక్ అతను కెప్టెన్ కాబట్టి అతన్ని వదిలేశారు.మిగిలిన అన్ని వారాల్లో అతను నామినేట్ అయ్యాడు.
అయితే అందరు అతన్ని టార్గెట్ చేయడం వల్ల ఆని గ్రాఫ్ పెరిగిపోతుంది.ఇదే ఓటింగ్ పర్సెంటేజ్ కొనసాగితే రేవంత్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి.
మరి మిగతా హౌజ్ మెట్స్ ఇది గమనించి అతని మీద మరింత ఫోకస్ పెట్టకుండా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.







