భారతదేశం పేదరిక నిర్మూలనకు చేస్తున్న కృషి అభినందనీయమని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.దాదాపు 15 సంవత్సరాల లో (2005-2020) దేశంలో 41.05 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారని లెక్కలు బయట పెట్టడం జరిగింది.ఇదే రీతిలో భారత్ కృషి చేస్తే అనుకున్నట్టుగానే 2030 సంవత్సరానికి దేశంలో సగానికి సగం మంది పేదరికం నుండి బయటపడతారని ఆ లక్ష్యానికి భారత్ చేరుకోగలదని స్పష్టం చేసింది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా అట్టడుగు వర్గాలలో పేదరికం తగ్గింది అని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.కచ్చితంగా ఇది చారిత్రాత్మక మార్పు.
ఇదే రీతిలో భారత్ ముందుకు పోతే అనుకున్నా లక్ష్యం 2030 నాటికి సాధిస్తారని స్పష్టం చేసింది.దేశంలో సగం మంది పేదరికం నుండి బయటపడతారని.
ఐక్యరాజ్యసమితి పేర్కొంది.ఈ పరిణామంతో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత్ 107వ స్థానంలో నిలిచింది.
ఒకప్పుడు భారత్ పేదరికనికి నిరక్షరాస్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది.వెనకబడిపోయిన దేశంగా పిలవబడే భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలోనే అగ్రదేశాల జాబితాలో స్థానం సంపాదించే దిశగా కొనసాగుతోంది.
విద్యా వైద్యం ఇంకా అన్ని రంగాలలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది.







