మొదటి నుంచి ఏపీ రాజధాని అమరావతి విషయంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి వైఖరి విభిన్న విధాలుగా ఉంది.స్వయంగా అమరావతికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
అన్ని విధాలుగా అప్పటి టిడిపి ప్రభుత్వానికి సహకారం అందించారు.కానీ ఆ తర్వాత అమరావతి విషయంలో బిజెపి తన వైఖరిని మార్చుకుంది.
ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికింది.అసలు రాజధాని వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తమకేమీ సంబంధం లేదు అన్నట్లుగా తప్పించుకునే ప్రయత్నం బిజెపి చేసింది అయితే ఏపీలో అమరావతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారడం, వైసిపి తోను మొదట్లో ఉన్నంత సఖ్యత లేకపోవడం ఏపీలో బిజెపికి కాస్తో.
కూస్తో సీట్లు రావాలంటే అమరావతి వ్యవహారం పైనే పోరాటం చేయాలనే నివేదికలు అందడంతో ఈ విషయంలో తనువైఖరిని మార్చుకుంది.
అమరావతికి తమ మద్దతు అంటూ ప్రకటనలు చేసింది.
ఇక ఏపీ బీజేపీ నాయకులు , కేంద్ర బిజెపి పెద్దలు అమరావతినే ఏపీ రాజధాని అంటూ ప్రకటనలు చేస్తూ మద్దతుగా నిలబడుతున్నారు. అయితే ప్రకటనలు , నిరసనలు , మద్దతు ఇవ్వడాలు ఇలా అన్ని చేస్తున్న, బిజెపి వైఖరి పై అందరికీ అనేక అనుమానాలు ఉన్నాయి.
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడంతో అమరావతిని రాజధాని గానే కొనసాగే విధంగా చేసే ఛాన్స్ కేంద్రానికి ఉంది. అయితే అలా మాత్రం చేయడం లేదు. మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు అనేక ఇబ్బందులు వైసిపి ప్రభుత్వానికి ఉన్నాయి.అయినా అవేమీ లెక్క చేయకుండా, వైసిపి ప్రభుత్వం ముందుకు వెళుతున్నా.
కేంద్రం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కేంద్రానికి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేసే అవకాశం ఉన్నా… ఆ విధంగా ముందుకు వెళ్లడం లేదు.

అలాగే అమరావతిని రాజధానిగా మార్చే ఛాన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు, బిల్డింగులను పెద్ద ఎత్తున అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నా, ఆ విధంగా చొరవ చుపించకపోవడం అనేక అనుమానాలను కలిగిస్తోంది.మొదటి నుంచి టిడిపి అమరావతి మాత్రమే ఏపీ రాజధాని, మూడు రాజధానుల ప్రతిపాదనను అంగీకరించేది లేదంటూ చెబుతూనే వస్తూ ఉండడంతో, అమరావతి ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన యాత్రలు, నిరసన కార్యక్రమాలు ద్వారా, టిడిపికి కలిసి వస్తోంది.దీంతో జనసేన, బిజెపి లు అమరావతి కే పూర్తిగా మద్దతు ఇస్తూ. దీనిపైనే పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.కానీ బీజేపీ ఎంతగా అమరావతికి మద్దతు పలికినా.ఆ పార్టీ పైన ఆ పార్టీ నాయకుల వైఖరి పైన అందరికీ అనుమానాలు ఇప్పటికీ వ్యక్తం అవుతూనే ఉన్నాయి.







