కోలీవుడ్ సీరియల్ అంటే దివ్య,అర్ణవ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.అంతేకాకుండా ఈ కేసు ట్విస్టుల మీద ట్రస్టులతో సాగుతోంది.
దివ్య తన భర్త అర్ణవ్ వేరే మహిళకు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ విషయంపై పోలీసులు అర్ణవ్ అతన్ని విచారించగా ఆమెకు మతిస్థిమితం లేదు అని చెప్పి పోలీసులకు షాక్ ఇచ్చాడు.
ఇది ఇలా ఉంటే ఇటీవల దివ్య, మరొక నటి అన్షిత తో కలిసి మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయిన విషయం తెలిసిందే.
ఫోన్లోనే ముద్దులు పెడుతూ ఆమె రెచ్చిపోయింది.
అంతే కాకుండా దివ్య ను చంపేస్తాను అంటూ బెదిరించింది.ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా తెలిసిన ఒక ట్విస్ట్ మరొక ఎత్తు అని చెప్పవచ్చు.
అదేమిటంటే అర్ణవ్ తన భర్త అంటూ ఒక ట్రాన్స్ జెండర్ అయినా ప్రియదర్శిని మీడియా ముందుకు రావడం ప్రస్తుతం ఊహించని షాక్ ఎదురవ్వడంతో పాటు కోలీవుడ్ మొత్తం షాక్ అయింది.మీడియా ముందుకు వచ్చిన ప్రియదర్శిని.
నాకు,అర్ణవ్ కు టీ నగర్లో పరిచయం అయ్యి ఆ తర్వాత మా మధ్య ప్రేమ చిగురించింది.ఆ తర్వాత అధికస్త పెళ్లికి కూడా దారి తీయడంతో మేమిద్దరం కలిసి ఒక గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకుని కాపురం పెట్టాము.

కొద్ది రోజుల వరకు అంతానే బాగా గడిచింది.ఆ తర్వాత ఎప్పుడైతే అతడికి దివ్యతో పరిచయం ఏర్పడిందో మా వద్ద విభేదాలు తలెత్తాయి.ఆ సమయంలో అతనిలో మరొక యాంగిల్ ని కూడా చూశాను.అతను ఒక పెద్ద సైకో.నన్ను తీవ్రంగా కొట్టేవాడు.అలా దివ్య తో సంబంధం పెట్టుకోవడానికి నన్ను వదిలించుకున్నాడు అని చెప్పుకొచ్చింది ట్రాన్స్ జెండర్ ప్రియదర్శిని.
మరి నటి దివ్య,అర్ణవ్ ల కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇంకా ఎంతమంది వెలుగులోకి వస్తారో చూడాలి మరి.







