టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఓరి దేవుదా… ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకోవడం కాకుండా తాజాగా ఈ సినిమా రాజమండ్రిలో ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకలో రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా రామ్ చరణ్ నటుడు విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ.మంచైనా చెడైనా ఒకసారి విశ్వక్ మాటిచ్చారంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాటపై నిలబడతారని మాట తప్పదు అంటూ ఆయన వ్యక్తిత్వం పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.
ఇక ఈయనకు గల్లీ గల్లీలో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారని ఈ సందర్భంగా రామ్ చరణ్ పేర్కొన్నారు.విశ్వక్ హీరోగా కంటే ఆయన పర్సనాలిటీకి తాను పెద్ద అభిమానిని ఈ సందర్భంగా రామ్ చరణ్ పేర్కొన్నారు.
ఒక వ్యక్తి అయినా ఒక సెలబ్రిటీ అయినా నమ్మిన దాని కోసం నిలబడటం స్నేహితుల కోసం నిలబడటం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్.ఇండస్ట్రీలో రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్వంటి హీరోలు నటించిన సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయినా ఇప్పటికే వాళ్లంతా స్టార్ హీరోలుగా ఉన్నారు అంటే అది కేవలం వారి వ్యక్తిత్వం కారణంగానేనని ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్ ఈ సినిమాలో ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటిస్తున్నారు.