తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.త్రిష ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న త్రిష తమిళంతో పాటు ఇతర భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.తెలుగులో ఈమె వర్షం,పౌర్ణమి,నువ్వొస్తానంటే నేనొద్దంటానా, లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే త్రిష ఇటీవలె పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
అయితే వయసు పెరుగుతున్నా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది త్రిష.తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో తమిళం తెలుగు ప్రేక్షకులను పలకరించింది.దీంతో త్రిష పేరు ఈ మధ్య బాగానే వినిపిస్తుంది.ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకు ఆమె ఓకే చెప్పిన విషయం తెలిసిందే.
కానీ చిరంజీవి సినిమా నుంచి ఆమె తప్పుకుంది.అందులో హీరోయిన్ కి అసలు ఇంపార్టెంట్ లేని క్యారెక్టర్ ఉండడంతో త్రిష తప్పుకుని మంచి పని చేసింది అని అంటున్నారు అభిమానులు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చూసి మరొక అగ్ర హీరో సినిమాలు హీరోయిన్ గా నటించే అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆ అగ్ర హీరో మరెవరో కాదు బాలకృష్ణ.బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా త్రిష అయితే బాగుంటుంది అని ఆమెను సంప్రదించి పనిలో పడ్డారట మూవీ మేకర్స్.అందుకోసం త్రిష కు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే గతంలో బాలకృష్ణతో లయన్ సినిమాలో నటించక అది డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.అయితే ఇందులో బాలకృష్ణతో నటించడంతోపాటు, బాలకృష్ణ కూతురుగా నటిస్తున్న శ్రీ లీల కు తల్లిగా కూడా కనిపించాలట.
మరి ఈ పాత్రకు త్రిష ఓకే చేస్తుందా లేదా చూడాలి మరి.







