శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏకతాటిగా కురుస్తున్న వర్షంలో సైతం ముంపుకు గురైన బాధితులను పరామర్శించేందుకు విచ్చేశారు.కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా జయమంగళీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
హిందూపురంలోని కొట్నూరు, శ్రీకంఠాపురం చెరువుల మరవులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.దింతో చౌడేశ్వరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, పళని నగర్ ఇళ్లలోకి వరద నీరు చేరాయి.
ఈ ప్రాంతాలలో ఎమ్మెల్యే బాలకృష్ణ వరద నీటిలో నడుచుకుంటూ వెళుతూ వెళ్లి వారిని పరామర్శించారు.ముంపు ప్రాంతాలలో జల జీవనంతో మేము ఇక్కడ నివసించలేకపోతున్నామని ఇంతవరకు ఇక్కడ ఏ ఒక్కరూ పర్యటించడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బాలకృష్ణకు చేతులెత్తి నమస్కరించి, కాళ్లు పట్టుకున్నారు.
బాధితులకు ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఇల్లు కూలిన బాధితులకు తక్షణమే నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే బాలక్రిష్ణ హామీ ఇచ్చారు.