ఈరోజుల్లో స్కూల్స్, కాలేజీలకు వెళ్లే కొందరు అమ్మాయిలు చదువుకోవడం తప్ప అన్నీ పనులు చేస్తున్నారు.మెచ్యూరిటీ రాకముందే ప్రేమలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తమ తల్లిదండ్రులు సమాజంలో తలదించుకునేలా కూడా చేస్తున్నారు.తాజాగా అలాంటి మరో ఇద్దరు విద్యార్థినులు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నారు.
ఈ అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్ విషయంలో జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు.జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో స్కూల్ యూనిఫాంలో ఈ ఇద్దరు బాలికలు కనిపించారు.
ఈ వీడియో చూసి నేటి యువత ఇలా పాడవుతుంది ఏంటని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ వీడియోలో విద్యార్థినులు ఒకరి జుట్టును ఒకరు చాలా బలంగా లాక్కోవడం చూడవచ్చు.వీరిద్దరూ ఒకరినొకరు విడవకుండా కలబడ్డారు.జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఆనంద కళాశాలకు చెందిన ఇద్దరు బాలికలు ఒకరికొకరు తన్నుకున్నారు.ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య కొట్లాట ఆపేందుకు వారి స్నేహితులు ప్రయత్నించారు.కానీ ఫలితం లేక పోయింది.మిగతా అమ్మాయిలు మాత్రం వారిని ఆపకుండా మౌనంగా ఉండిపోయారు.చివరికి వారిద్దరి స్నేహితులు ఈ గొడవ ఆపారు.అప్పటికీ ఆ విద్యార్థినులు ఒకరినొకరు తిట్టుకొంటూ కనిపించారు.
వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో కొంతమంది అబ్బాయిలు ఈ స్కూల్ గర్ల్స్ ఫైటింగ్ చూస్తూ ఎంజాయ్ చేశారు.వారిపై కామెంట్లను పాస్ చేస్తూ.ఫైట్‌ను మరింత తీవ్రతరం చేసేందుకు ఎంకరేజ్ చేశారు.హజారీబాగ్‌లోని ఆనంద కాలేజీ క్యాంటీన్ వెలుపల ఈ ఘటన జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది.
అన్‌సీన్ ఇండియా అనే ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే 1 లక్షా 26 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.







