ఇది వరకు కన్నడ సినిమా అంటే దక్షిణాదిలో పెద్ద ఆసక్తి కనబర్చేవారు కాదు.వీరి సినిమాలు డబ్బింగ్ అయ్యి వచ్చిన పెద్దగా పట్టించుకునే వారు కాదు.
కానీ ప్రశాంత్ నీల్ ఎప్పుడైతే కేజిఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించాడో అప్పటి నుండి కన్నడ వైపు కూడా అందరి చూపు పడింది.ఇక పార్ట్ 2 అయితే 1000 కోట్లు కలెక్ట్ చేసి మరింత సంచలనం సృష్టించి కన్నడ ఇండస్ట్రీని ప్రపంచ నలువైపులా గుర్తించేలా చేసాడు.
గతంతో పోలిస్తే ఇక్కడ మంచి కంటెంట్ సినిమాలు రావడం.గ్రాఫిక్స్ కూడా బాగా ఉపయోగించు కోవడంతో వీరి సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అవ్వడమే కాకుండా తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు పొందుతున్నారు.
ఇక తాజాగా కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమా కాంతారా.
రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇక ఈ సినిమా పరుగులు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.ఇప్పటికే కాంతారా సినిమా బాక్సాఫీస్ దగ్గర 58 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.

ముందు ముందు ఈ సినిమా కన్నడ లోనే 100 కోట్లు సాధించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటున్నారు
ఈ సినిమా కన్నడ వర్షన్ సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేసారు.ఈ సినిమా ఇక్కడ కూడా కాసుల పంట కురిపిస్తుంది.ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎగబడుతున్నారు.ఈ వారం తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ అయినా.మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఉన్న కూడా ఈ సినిమాపైనే అందరి ద్రుష్టి పడింది.ఇలా కన్నడ సినిమా తెలుగు ప్రేక్షకులను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంది.
దీంతో ఈ సినిమా కు ఇంత క్రేజ్ ఏంట్రా బాబు అని అంతా అనుకుంటున్నారు.







