కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.సీఎం నవీన్ పట్నాయక్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్లు ప్రకటించింది.
అదే విధంగా ఇకపై కాంట్రాక్ట్ నియామకాలను రద్దు చేయనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ఉన్నవారిని క్రమ బద్ధీకరించనున్నామని, ఆపై ఈ విధానంలో భర్తీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
ఇందుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.కాగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రతి ఏటా రూ.1300 కోట్ల అదనపు భారం పడనుంది.