నిన్న ఉపేంద్ర, నేడు యష్, ఇక భవిష్యత్తు రిషబ్ శెట్టి దే

కాంతారా… కాంతారా… ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ముచ్చట.ఎవరు మాట్లాడినా ఇదే విషయం.

 Why Kanthara Is A Trend Settar , Kanthara, Rishabh Shetty, Kgf Movies, Director-TeluguStop.com

నిన్న వచ్చిన కేజీఫ్ సినిమా మినహా అంతక ముందు కన్నడ సినిమాల గురించి మన తెలుగు వారు చర్చించిన దాఖలాలు తక్కువే.ఇంతగా కాంతారా సినిమా గురించి మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటి అనే కదా చాలా మంది సందేహం.

ఆ విషయానికే వస్తున్న.ఈ సినిమా గురించి ఇంతగా మాట్లాడుకోవడానికి గల మొదటి కారణం రిషబ్ శెట్టి.

ఈ సినిమాకు ఇతడే దర్శకుడు కూడా.సినిమాలో అతి ముఖ్యమైన ఒక పాత్ర లో కూడా రిషబ్ నటించాడు.

సినిమాలో హీరో కి దేవుడు పునుతాడు కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు హీరో పూనుతాడు.అంతలా అద్భుతమైన నటనతో సినిమాను ఇంటి చేత్తో లేపి నిల్చోబెట్టాడు.

ఇక కథ రాసుకున్న విధానం కూడా మరొక ఖచ్చితమైన కారణం ఈ సినిమా హిట్ అవ్వడానికి.కాదు కాదు మైండ్ బ్లాంక్ అయ్యే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి.

ఈ సినిమా తొలి భాగం అంతా ప్రేక్షకుడికి కథను పరిచయం చేసే పనిలోనే ఉన్నాడు దర్శకుడు.ఒక్క సారి జైలు నుంచి హీరో విడుదల అయ్యాక థియేటర్ లో పునకాలే ఇక.ఇది కదా సినిమా అంటే .ఇది కథ సంప్రదాయం అంటే.కన్నడ చిత్ర పరిశ్రమ భారతీయ సంప్రదాయాలను , మూలలను సరికొత్తగా తెర పైన ఆవిష్కరిస్తూ తెలియచేస్తుండటం అద్భుతం.

Telugu Bollywood, Kantara, Kanthara, Kgf, Rishabh Shetty, Tollywood, Kantharatre

ఇక రొటీన్ కథలను చూడటం బోట్ కొట్టిస్తే ఇలాంటి నూతన అంశాలను, సున్నితమైన భావాలను తెలిపే సినిమాలు చూస్తే ఆ మజానే వేరు.ఇక మొన్నటి వరకు హీరో ఉపేంద్ర కూడా ఇలాగే కొన్ని సరికొత్త సినిమాలను కన్నడ ఇండస్ట్రీ కి అందించాడు.ఆ తర్వాత యష్ హీరోగా వచ్చిన కెజిఎఫ్ సినిమాలు మరోమారు ఆ పరిశ్రమను దేశం మొత్తం తలెత్తుకునేలా చేసాయి.

ఇక ఇప్పుడు కాంతారా సినిమా ఖచ్చితంగా వీటన్నిటిని మించి ముందుకు పోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.కాంతారా ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా.

కేవలం కన్నడిగులు మాత్రమే కాదు పురాతన ఆచార వ్యవహారాలను సంస్కృతిని ప్రతిబింబించే మరిన్ని సినిమాలు అన్ని భాషల్లో రావాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube