బిగ్ బాస్ హౌస్ లో జోడీలు ఎక్కువయ్యాయి.శ్రీ సత్యకు దగ్గరవడానికి అర్జున్ తెగ ప్రయత్నాలు చేస్తుంటే.
మరోపక్క సూర్య, ఇనయాల రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుది.ఆరోహి ఉన్నన్నాళ్లు ఆమెతో క్లోజ్ గా ఉన్న సూర్య ఆమె వెళ్లాక ఇనయాకి కనెక్ట్ అయ్యాడు.
ఇనయా కూడా తన క్రష్ సూర్య అని చెప్పగానే అప్పటినుంచి ఆమెని దగ్గరకు తీసుకున్నాడు.ఫైనల్ గా సూర్య, ఇనయాల రొమాన్స్ టాక్ ఆఫ్ ది హౌస్ గా మారింది.
అయితే సూర్య ఇప్పుడు ఇంటి కెప్టెన్ అయ్యాడు.ఈ క్రమంలో సూర్య కెప్టెన్ అవగానే అతన్ని బావ అనేసింది ఇనయా సుల్తానా.
మా బావ కెప్టెన్ అయ్యాడంటూ కేకలు వేసింది.ఫ్రెండ్ షిప్ వరకు ఓకే కానీ ఇలా బావ అని పిలిచేంత క్లోజ్ నెస్ ఏంటో అని అందరు అనుకుంటున్నారు.
అంతేకాదు సూర్య మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇనయా ఆటలో కూడా వెనకపడ్డది.ఇనయా, సూర్యల రొమాన్స్ చూసి ఆడియన్స్ కూడా బాబోయ్ అనేస్తున్నారు.మరి ఈ బావ మరదళ్ల రిలేషన్ ఎందాకా వెళ్తుంది అన్నది చూడాలి.ప్రస్తుతానికి అయితే సూర్య టాప్ 5 దాదాపు కన్ఫర్మ్ అవగా.
విన్నర్ అవడానికి మాత్రం ఈ పులిహోర వ్యవహారాలు కట్టేస్తే బెటర్ అని ఆడియన్స్ అంటున్నారు.