ఒకప్పుడు పెళ్లి అయితే చాలు ఆ హీరోయిన్ నటనకు గుడ్ బై చెప్పి చక్కగా లైఫ్ లో సెటిల్ అయ్యేవారు.హీరోయిన్స్ అవకాశాలు ఉన్నంత వరకు సినిమాలు చేస్తూ అవకాశాలు తగ్గుతున్న సమయంలో పెళ్లి పీటలు ఎక్కుతారు.
మరి కొంత మంది కెరీర్ పీక్స్ లో ఉండగానే మంచి వరుడిని చూసుకుని పెళ్లి చేసుకుంటారు.ఎలా పెళ్లి చేసుకున్న ఒకప్పుడు పెళ్లి తర్వాత సినిమాల్లో నటించే వారు కాదు.
ఒకవేళ నటించిన వారు అక్కగా, అత్తగా, వదిన లాంటి పాత్రలు చేసుకోవాల్సిందే.కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.పెళ్లి అయినా పిల్లలు పుట్టిన సరే వీరు నటించడం మాత్రం ఆపడం లేదు.పెళ్లి జరిగిన ఎందులోనూ తగ్గేదేలే అంటున్నారు.
బాలీవుడ్ లోనే కనిపించే ఈ విధానం ఇప్పుడు పర భాషల్లో కూడా వచ్చింది.పెళ్లి అయినా హీరోయిన్ లే టాప్ లో కొనసాగుతూ ఆశ్చర్య పరుస్తున్నారు.
కొత్త నాయికలకు ధీటుగా రాణిస్తూ వారికీ గట్టి పోటీ ఇస్తున్నారు.
మరి ఈ లిష్టులో ముందుగా సమంత గురించి చెప్పుకోవాలి.
ఈమె నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న తన కెరీర్ ను కొనసాగించింది.చైతూ కూడా ఈమె కెరీర్ ను ఆపలేదు.
ఆమెతో కలిసే నటించాడు.అయితే ఇటీవలే చైతూతో బ్రేకప్ తర్వాత కూడా మరింత హాట్ గా మారిపోయి మరిన్ని అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.
ఇక ఈ లిష్టులో లేడీ సూపర్ స్టార్ నయన్ తార కూడా ఉంది.ఈమె కూడా ఇటీవలే పెళ్లి చేసుకుంది.అయినా వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది.పెళ్ళికి ముందు ఎలా సినిమాలు చేసిందో అలానే చేస్తూ వస్తుంది.
గాడ్ ఫాదర్ లో కనిపించి అందరిని ఫిదా చేసింది.ఎటువంటి అందాలు ఆరబోయక పోయిన తన బ్యూటీతో అందరిని మెస్మరైజ్ చేసింది.
ఇక చందమామ కాజల్ అగర్వాల్ సైతం పెళ్లి చేసుకుని ఇటీవలే ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది.అయినా సరే ఈమె మెరుపులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
ప్రెజెంట్ ఈ బ్యూటీ కమల్ హాసన్-శంకర్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది.
అలాగే శ్రీయ కూడా బిడ్డకు తల్లి అయినా అదే అందంతో వరుస సినిమాలు చేస్తుంది.ఈమెను చూసిన ఫ్యాన్స్ 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో అలానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అలానే అమలాపాల్ సైతం పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న వరుస సినిమాలు చేస్తూ పెళ్లికి ముందు కంటే ఇప్పుడు మరింత రాణిస్తూ దూసుకు పోతుంది.