సామాజిక మాధ్యమాల్లో పిల్లల అశ్లీల చిత్రాలపై ఏపీ సీఐడీ చర్యలకు సిద్ధమైంది.ఫేస్ బుక్, యూట్యూబ్, జీ మెయిల్ ద్వారా పిల్లల అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది.
ఈ క్రమంలో నమోదైన ఓ కేసులో 12 మంది నిందితులున్నారు.కాగా ఈ అశ్లీల చిత్రాలను అప్ లోడ్ చేసిన వారు విజయవాడకు చెందిన వ్యక్తులుగా సీఐడీ అధికారులు గుర్తించారు.
సీఐడీ సమాచారంతో విజయవాడ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.ముగ్గురు మహిళలలో సహా 12 మందిపై కేసు నమోదు చేశారు.