ఏపీ సీఎం జగన్ పై టిడిపి నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీఎం జగన్ చెప్పే మాటలు వేరు చేసే పనులు వేరని విమర్శించారు.
మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.అమరావతి రాజధాని అనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి.
అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటున్నారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన హామీలను జగన్ మర్చిపోయిన ప్రజలు మర్చిపోరని ఆయన తెలిపారు.