గుంటూరు జిల్లాలో నిత్య పెళ్లి కొడుకును దిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎక్కటి బాజీ నారాయణ అనే వ్యక్తి మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేస్తూ.
ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.చేబ్రోలుకు చెందిన ఓ యువతిని మ్యాట్రిమోని ద్వారా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు.
అనంతరం రెండు నెలల్లోని మరో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.అమెరికాకు వెళ్లి బీహార్ కు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు ఈ నిత్య పెళ్లికొడుకు.
అనుమానం వచ్చిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది.దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.