ఏపీ లో ముందస్తు ఎన్నికల హడావుడి ఇప్పటిది కాదు .ఎప్పటి నుంచో దీనిపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
వైసిపి ఏ కీలక నిర్ణయం తీసుకున్నా. అది ముందస్తు ఎన్నికల్లో భాగంగానే అని టిడిపి బలంగా నమ్ముతోంది.
అంతేకాకుండా టిడిపి అధినేత చంద్రబాబు తమ పార్టీ నాయకులకు ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని , పార్టీ నాయకులు అంతా అలర్ట్ గా ఉండాలంటూ పదేపదే చెబుతూనే వస్తున్నారు.గతంలో జరిగిన పార్టీ కీలక సమావేశాల్లోనూ ముందస్తు ఎన్నికలపై ప్రకటనలు చేశారు.
అయితే ఈ వ్యవహారాలపై వైసీపీ కీలక నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, అవన్నీ వట్టి ఊహాగానాలు అంటూ కొట్టు పారేశారు.
ఆ తర్వాత కొంతకాలం పాటు సైలెంట్ గానే ఉన్నా… బాబు మాత్రం ఇప్పుడు మళ్లీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.తాజాగా పార్టీ కీలక నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జీలతో నిర్వహించిన సమావేశంలో ముందస్తు ఎన్నికలపై ప్రకటన చేశారు.
ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ముందస్తు ఎన్నికలు వస్తాయి అంటూ బాబు చెబుతున్నారు.అలాగే నియోజకవర్గ ఇన్చార్జీలు అప్రమత్తంగా ఉండాలని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని , ఎక్కడా అలసత్వం వహించవద్దని చెబుతున్నారు.
ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి మళ్ళీ టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా, దాదాపు 40 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా వందకు పైగా స్థానాల్లో టికెట్లను కేటాయించాల్సి ఉంది.
ఈ వ్యవహారం ఇలా ఉండగానే జనసేన పార్టీతోను పొత్తు ఉంటుందనే సంకేతాలను ఇస్తున్నారు.అయితే ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది స్పష్టత వచ్చిన తర్వాతే పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించాలని బాబు చూస్తున్నారు ఈలోపు పార్టీ నాయకులంతా జనాల్లోకి వెళ్లాలని, ఎక్కడా అలసత్వం వహించవద్దని చెబుతున్నారు.

ఈ మేరకు ముందస్తు ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ నాయకులను మరింత అలర్ట్ చేసే పనిలో బాబు నిమగ్నమయ్యారు.ముందస్తు కంగారు పెట్టడం ద్వారా, పార్టీ నాయకుల్లో ఉత్సాహం చురుకుదనం పెంచాలని, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రోత్సహించి నియోజకవర్గం లో పార్టీ బలోపేతం అయ్యేలా. 2024 ఎన్నికల్లో టిడిపి గెలిచేందుకు అవసరమైన బాటలు వేసేందుకు బాబు ముందస్తు జపం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.అందుకే వైసిపి ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్సే లేదని చెబుతున్న , బాబు మాత్రం ముందస్తు జపం చేస్తూనే ఉన్నారు.








