పడిపోయిన జుకర్‌బర్గ్‌ ఫాలోయింగ్... ఒకేసారి 11 కోట్లమంది ఫాలోవర్లను కోల్పవడానికి కారణం ఇదేనా?

మార్క్ ఇలియట్ జుకర్‌బర్గ్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు.ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త, ఇంటర్నెట్ వ్యవస్థాపకుడు అయినటువంటి ఇతను గురించి తెలియనివారు ఈ ప్రపంచంలోనే వుండరు.

 Zuckerberg's Falling Following Is This The Reason For Losing 11 Crore Follower-TeluguStop.com

అతను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ మరియు దాని మాతృ సంస్థ అయినటువంటి మెటా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విశేష ప్రజాదరణ పొందాడు.ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒక్కడిగా కీర్తించవచ్చు.జుకర్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుని అభ్యసించాడు.2004లో తన రూమ్‌మేట్స్ అయినటువంటి ఎడ్వర్డో సావెరిన్, ఆండ్రూ మెక్‌కొల్లమ్, డస్టిన్ మోస్కోవిట్జ్ మరియు క్రిస్ హ్యూస్‌లతో కలిసి Facebookని స్థాపించాడు.

ఈ క్రమంలో ఇతను కొన్ని బిలియన్ల ఫాలోయర్స్ ని సంపాదించాడు.కాగా జుకర్‌బర్గ్‌కు తాజాగా ఓ భారీ షాక్ తగిలింది.అవును, అతను సృష్టించిన ఫేస్‌బుక్‌లోనే అతను 11 కోట్ల మందికిపైగా ఫాలోవర్లను కోల్పోయారు.అయితే ఇలా జుకర్‌బర్గ్ ఒక్కడికే జరగలేదు.

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది భారీ సంఖ్యలో ఫేస్‌బుక్ ఫాలోవర్లను కోల్పోయినట్టు భోగట్టా.దీనిపై బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ తాజాగా ట్వీట్ చేశారు.

Telugu Andrew Mccollum, Eduardo Saverin, Followers, Jukenbark, Ups-Latest News -

ఆమె మాట్లాడుతూ… “ఫేస్‌బుక్ లో తాజాగా ఓ పెద్ద సునామీ వచ్చింది.దాంతో దాన్ని సృష్టించిన అతనికే పెద్ద ఝలక్ తగిలింది.అలాగే నాకు ఉన్న ఫాలోయర్స్ కూడా 9 లక్షలమందికిపైగా కొట్టుకుపోయారు.కేవలం 9 వేలమంది మాత్రమే ఒడ్డుకు వచ్చారు.ఫేస్‌బుక్ చేసిన ఈ కామెడీ భలే ఉంది” అంటూ చమత్కరించింది.కాగా దీనిపై మెటా సంస్థ ప్రతినిధులు కూడా తాజాగా స్పందించారు.

కొంతమంది ఫాలోవర్ల సంఖ్యలో తేడాలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని వాళ్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube