నాయుడుపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఓ మహిళ హల్‌చల్ చేసింది.దాదాపు గంటకు పైగా రోడ్డుపై బైటాయించింది.
దీంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది.సమాచారం అందుకున్న సీఐ సీహెచ్ ప్రభాకర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళతో మాట్లాడారు.
ఆ మహిళ సీఐతో పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో ఆమె మానసిక స్థితి సరిగా లేన్నట్లు గుర్తించారు.అయితే సదరు మహిళ బ్యాగులో బురఖా ఉండడంతో ముస్లిం అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు.
అనంతరం ఆ మహిళకు నచ్చజెప్పి స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్ వద్ద ఉన్న రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు.







