నేటి సమాజంలో ప్రజలను ఒక్కొక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం దాగి ఉంది.ఎందుకంటే వారికి అవసరం వచ్చినప్పుడు అలాంటి నైపుణ్యాలు బయటకి వస్తూ ఉంటాయి.
వారి అవసరాలకు తగిన ఆలోచనలు చేస్తూ నేటి ప్రజలు జీవిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే క్రియేటివ్ ఐడియాల తో సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వాళ్ల వీడియోలు మనకు చాలా కనిపిస్తాయి.
అలాంటి క్రియేటివ్ నైపుణ్యం కలిగిన యుపిలోని ఓ బస్ డ్రైవర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.
ఒక డ్రైవర్ తన బస్సు అద్దాలకు ఉన్న సమస్యను ఎలా ఎలా క్లియర్ చేసుకున్నాడో చూస్తే షాక్ అయిపోతారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యూపీఎస్ఆర్టీసీ బస్సు కు ఉన్న సమస్య తో బస్సు నడుపుతున్న డ్రైవర్ విసుగు చెంది ఒక బాటిల్ తో ఆ సమస్య కు పరిష్కారాన్ని కనుగొన్నాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యుపిఎస్ ఆర్టీసీ లో పనిచేస్తున్న ఒక డ్రైవర్ ఆయన బస్సు అద్దాల వైపర్ ను తాడుతో కట్టి ఉంచాడు.అప్పటికప్పుడు ఆ తాడుతో కట్టిన వైపర్ పని చేయాలంటే దానికి మరి ఒక నీళ్ల బాటిల్ ను జత చేసి కట్టాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది.ఈ వీడియోని చూసిన వారు చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
డ్రైవర్ చేసిన ఈ ఆలోచనకి చాలామంది నెట్టిజెన్లు సలాం కొడుతున్నారు.మరి కొంతమంది యూపీస్ ఆర్టీసీ బస్సు వైపర్ కూడా రిపేరు చేయలేరా అని విమర్శిస్తున్నారు.
ఈ బస్సు వీడియో వైరల్ అయిన తరువాత, మీరట్ డిపో ఆర్టీసీ అధికారులు వెంటనే వైపర్ రిపేర్ చేశామని తెలిపింది.