దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.దీనిలో భాగంగా ఇప్పటికే విజయ్ నాయర్, సమీర్ మహేంద్రులతో పాటు బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసింది.
కాగా అభిషేక్ బోయిన్పల్లి మూడు రోజుల కస్టడీ ముగిసింది.దీంతో ఆయనను నేడు రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరచనున్నారు సీబీఐ అధికారులు.
అభిషేక్ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనున్నారు.హవాలా రూపంలో ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారులకు అభిషేక్ ముడుపులు చెల్లించారని సీబీఐ ఆరోపణలు చేస్తుంది.







