హైదరాబాద్ లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.మీర్ పేటలోని గాయత్రినగర్ లో మూసా ఖురేషిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐబీ ఆఫీసర్ హత్య కేసులో ఖురేషి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్యకు గురైన సంగతి తెలిసిందే.2020 ఫిబ్రవరి 25న జరిగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను కూడా చాంద్ బాగ్ పులియా సమీపంలో ఓ మూక దారుణంగా చంపింది.అనంతరం అతని మృతదేహాన్ని నిందితులు సమీపంలోని చాంద్ బాగ్ డ్రెయిన్‌లో పడేశారు.
ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న ఖురేషీ 2020 ఫిబ్రవరి నుంచి పరారీలో ఉన్నాడు.ఢిల్లీ కోర్టు అతన్ని ఈ కేసులో ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించింది.అతనిపై ఢిల్లీ పోలీసులు రూ.50,000 రివార్డును కూడా ప్రకటించారు.