బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ క్రమంలో బీజేపీ పెద్దలను ఆయన కలవనున్నారని సమాచారం.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ టూర్ కి ప్రాధాన్యత సంతరించుకుంది.ఉపఎన్నిక నేపథ్యంలో గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ నేతలతో ఆయన చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.
మునుగోడు ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.







