తలలు తెగినా విశాఖను రాజధాని చేసుకుంటామని మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.వికేంద్రీకరణకు మద్ధతుగా వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన టీడీపీ గుండెల్లో గునపం దింపుతుందని అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉత్తరాంధ్ర అంటేనే ఉద్యమమన్న ఆయన.ఉద్యమం దెబ్బ చూడాలంటే ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టాలనే ఉద్దేశం చంద్రబాబు మానుకోవాలని అన్నారు.మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనన్నారు.
సీఎం జగన్ నిర్ణయానికి ప్రతి గ్రామంలో ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు.తలలు తెగినా ప్రాణాలు పోయినా విశాఖను అభివృద్ధి చేసుకుని తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.