ఫొటోల కోసం ఫోజులు ఇస్తున్న హ్యాండ్సమ్ పిల్లి.. ఇంతలోనే ఫన్నీ ట్విస్ట్..

సోషల్ మీడియాలో వైరలయ్యే క్యూట్ క్యాట్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఇవి చేసే చేష్టలు ఒక్కోసారి పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి.

 Viral Video Cat Posing For Photos,cat Video, Cat Photo Posing, Cats Videos,viral-TeluguStop.com

వాటి చేష్టలకు సంబంధించిన వీడియోలను ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపించేంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.అయితే తాజాగా ఒక క్యాట్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఇదొక ఫన్నీ వీడియో కాగా ఇది నెటిజన్ల ముఖాలపై చిరునవ్వు చిందిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే ఒక బల్లపై ఒక తెల్ల మచ్చల పిల్లి కూర్చొని ఉండటం చూడవచ్చు.

ఈ పిల్లి ఒక డ్రెస్ కూడా ధరించింది.చూసేందుకు అది చాలా ఎట్రాక్టివ్ గా ఉంది.కాగా ఒక యువతి దీనిని ఫొటోలు తీయడం ప్రారంభించింది.ఆ ఫోటోలకు ఈ హ్యాండ్సమ్ పిల్లి వివిధ ఫోజులు ఇస్తూ కనిపించింది.

ఈ క్రమంలోనే మరొక పోజు ఇచ్చేందుకు అది ముందర కాలు పైకెత్తింది.కిల్లింగ్ లుక్ లో కనిపించాలని అనుకుంది.

కానీ ఇంతలోనే అది బల్లపై బ్యాలెన్స్ కోల్పోయింది.బల్ల చివర అంచున నిల్చోవడం వల్ల ఈ క్యాట్ వెంటనే పడిపోయింది.

దాంతో ఫొటోలు తీస్తున్న యువతి బాగా నవ్వేసింది.

ఈ వీడియోను ప్రముఖ ట్విట్టర్ పేజీ @ట్వీట్స్ఆఫ్‌క్యాట్స్ (@tweetsofcats) షేర్ చేసింది.“సో హ్యాండ్సమ్ హో, నో!” అని ఈ వీడియో కి ఒక క్యాప్షన్ జత చేసింది.దీనికి ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

దీన్ని చూసిన నెటిజన్లు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు.దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube