మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగానే మునుగోడులోని పలివేలలో మంత్రి జగదీష్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంతో పాటు కాన్వాయ్ లో సోదాలు చేశారు.అనంతరం ఏమీ దొరకలేదని పోలీసులు తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.







