తెలుగు బుల్లితెర సెలబ్రిటీ సిరి హనుమంతు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన సిరి.
తొలిసారిగా ఉయ్యాల జంపాల సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది.ఆ తర్వాత మోహిని, అగ్నిసాక్షి సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదంతా పక్కన పెడితే.ఈమె మరో నటుడు శ్రీ హాన్ ను ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా వీరిద్దరు కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు.సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్ళు సిరీస్ లో నటించగా ఈ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నారు.
అంతేకాకుండా రామ్ లీలా అనే వెబ్ సిరీస్ కూడా వీరికి మంచి క్రేజ్ ను అందించింది.ఇక పలు బుల్లితెర షో లలో కూడా వీళ్లు జంటగా పాల్గొన్నారు.
గతంలో స్టార్ మా లో 100% లవ్ అనే షో లో వీరికి స్టార్ మా నిశ్చితార్థ వేడుకలు కూడా జరిపించన సంగతి తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే.
బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ లో సిరి పాల్గొని ఎంత రచ్చ నడిపిందో చూసాం.ఏకంగా ప్రేమ జంట మధ్య చిచ్చుపెట్టి పక్కకు తప్పుకుంది.
గతంలో సీజన్ 5 పూర్తవగ అందులో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యంగా షణ్ముఖ్, సిరి ల గురించి మాత్రం బాగా వైరల్ గా మారింది.
వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

మొదట వీరిద్దరు కూడా పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కలిసి చేశారు.తర్వాత ఇద్దరికీ బిగ్ బాస్ హౌస్ లో అవకాశం వచ్చింది.ఇక బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న వీరిద్దరూ తమ స్నేహాన్ని మరింత బలపరుచుకున్నారు.
ఏకంగా హగ్గు లతో, ముద్దులతోనే స్నేహమని ముసుగు వేసి రెచ్చిపోయారు.దాంతో వీరిద్దరూ హౌస్ లో ఉండగానే బయట నెగెటివిటీ మోశారు.
ఇక వీరిద్దరి మధ్య జరుగుతున్న రొమాన్స్ ను చూసి నాగార్జున కూడా ఫైర్ అయి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.అయినా కూడా వీరిద్దరూ అలాగే రెచ్చిపోయారు.అప్పటికే షణ్ముఖ్ సోషల్ మీడియా స్టార్ట్ దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.కానీ సిరితో అల ప్రవర్తించడంతో దీప్తి సునైనా షన్ను కు బ్రేకప్ చెప్పింది.

ఇక ఈ విషయం కూడా బాగా హాట్ టాపిక్ గా మారింది.సిరి కూడా బిగ్ బాస్ షో ముందు తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.ఇక షో తర్వాత వీరిద్దరి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.కానీ చాలావరకు శ్రీహన్ కూడా సిరి తో బ్రేక్ అప్ అంటాడు అనుకున్నారు.కానీ ఇప్పుడు ఇద్దరూ కలిసే ఉన్నారు.అయితే ప్రస్తుతం శ్రీహాన్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇక శ్రీహాన్ గురించి ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది సిరి.అతన్ని ఎలాగైనా గెలిపించాలి అని పోస్టులు చేస్తూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.అందులో ఒక నెటిజన్.
శ్రీహాన్ ను ఇస్తావా సిరి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అనడంతో వెంటనే సిరి షాక్ అవుతున్నట్లు ఒక ఫోటో షేర్ చేసుకుంది.
ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.