సినిమా షూటింగ్ కు అనుమతులు రద్దు చేస్తూ అక్కినేని హీరోకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్నారు నాగచైతన్య.సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Karnataka Government Denied Permission For Naga Chaitanya Venkat Prabhu Movie Sh-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటూ ఉండగా కర్ణాటక ప్రభుత్వం ఈ సినిమా షూటింగుకు బ్రేకులు వేసింది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతుంది.

ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం కర్ణాటకలోని మేలుకోట సమీపంలో ఆ జిల్లా అధికారుల నుంచి షూటింగ్‌కి అనుమతులు తీసుకొని జరుపుతున్నారు అయితే భాగంగా చిత్ర బృందం ఒక వైన్ షాప్ సెట్ వేశారు.ఇలా వైన్ షాప్ సెట్ రాజగోపురాన్ని పోలి ఉండడంతో అక్కడి స్థానికులు ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.

Telugu Akkineninaga, Denied, Karnataka, Krithi Shetty, Nagachaitanya, Venkat Pra

ఈ విధంగా స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి చిత్ర బృందం నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈ సినిమా షూటింగుకు అనుమతులను రద్దు చేశారు.ఇక ప్రభుత్వం సినిమా షూటింగుకు బ్రేకులు వేయడంతో చేసేదేమి లేక చిత్ర బృందం తమ షూటింగ్ నిలిపి వేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి చిత్రబంధం ఇప్పటివరకు ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం.ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్నారు.ఈ సినిమాకు ఇళయరాజా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube