యాదాద్రి జిల్లా:భువనగిరి ఎంపీ,టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు డుమ్మా కొడతారని ముందు నుంచి అందరూ అనుకున్నదే కానీ,అంతా అనుకున్నట్లే జరిగుతుందా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి.తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ పెరిగిన నేపథ్యంలో ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలా అని రాజకీయ పార్టీలు కింద మీద పడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలేలా ఉంది.
ఇప్పటి వరకు మునుగోడు ఉప ఎన్నికల కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తారని అంతా భావించారు.కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
కానీ,అనూహ్యంగా కోమటిరెడ్డి అందరికీ షాకిచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి కోమటిరెడ్డి వెంటకరెడ్డి దూరంగా ఉండనున్నట్టు,ఈనెల 15వ తేదీన కోమటిరెడ్డి తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయ సమాచారం.
మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే ఆయన మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.ఇక,మునుగోడు ఉప ఎన్నికల బరిలో కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం.







