యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది.దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి పట్టణ వాసులు తిరిగి నగర బాట పట్టారు.
దీంతో పంతంగి టోల్ ప్లాజాతో పాటు నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.ఫాస్టాగ్ స్కాన్ కు సమయం పడుతుండటంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఎక్కడా చూసిన వాహనాలే కన్పిస్తున్నాయి.







