ఐరన్ లెగ్ అనే ముద్ర ఫ్లాప్ హీరోయిన్స్ కి దక్కుతుంది.ఇక వాళ్ళు మంచి సక్సెస్ అందుకునే వరకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ను మోయక తప్పదు.
అలా ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఈ ట్యాగ్ ను మోస్తూనే ఉన్నారు.మంచి సక్సెస్ అందుకుంటే ఈ ట్యాగ్ ను తొలగించుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు.
కానీ వారికి మాత్రం సరైన అవకాశాలు రాలేకపోతున్నాయి.ఇక అటువంటి ముద్రనే మోస్తూ అవకాశాలు అందుకోలేకపోతున్న హీరోయిన్లలో ఒకరు అను ఇమ్మాన్యుయేల్ అని చెప్పవచ్చు.
టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన గ్లామర్ బ్యూటీ నటి అను గురించి అందరికీ తెలిసిందే.సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో వరుస ఆఫర్లతో బాగా గుర్తింపు పొందింది.
ఈ భామ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లతో బాగా ముచ్చటిస్తుంది.
ఈ బ్యూటీ 2011లో స్వప్న సంచారి అనే మలయాళం సినిమా లో బాలనటిగా పరిచయం అయ్యి.
ఆ తర్వాత యక్షన్ హీరో బిజు అనే సినిమా లో హీరోయిన్ గా తెరకెక్కింది.ఇక 2016 మజ్ను సినిమా తో తెలుగులో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత వరుస సినిమాలలో నటించిన అను. టాలీవుడ్ లో ఎందుకో అంతగా సరైన పేరు తెచ్చుకోలేక పోతుంది.దీంతో ఈ అమ్మడుకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ కూడా వచ్చింది.గతంలో ఈమె ఒక ప్రేమ వ్యవహారంలో బాగా హాట్ టాపిక్ గా మారింది.2017 లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు సినిమా ఆక్సిజన్.ఈ సినిమాలో అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటించింది.
దీంతో ఆ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం మొదలయింది.స్నేహం కాస్త ప్రేమగా మారిందని బాగా వార్తలు వచ్చాయి.

అలా ఈ విషయం గురించి ఎన్నో వార్తలు బయటకు రాగా ఇప్పటివరకు అను గాని, దర్శకుడు జ్యోతి కృష్ణ గాని స్పందించలేదు.దీనిని బట్టి వీరిమధ్య నిజంగానే ప్రేమ ఉందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.ఇక ఆ మధ్య ఈ బ్యూటీ మహాసముద్రం సినిమాలో కూడా నటించగా ఆ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది.ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరో కార్తీ పక్కన అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం కార్తీ వరుస సక్సెస్ లతో బాగా దూసుకుపోతున్నాడు.అయితే కార్తీ త్వరలో రాజు మురుగన్ దర్శకత్వంలో ఓ సినిమా చేనునట్లు తెలుస్తుంది.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.ఇక అందులో ఒక బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్లు బాగా ప్రచారం జరగగా.అందులో అను ఇమ్మాన్యుయేల్ కు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ బ్యూటీ కి కార్తీ సరసన నటించే అవకాశం దక్కగా ఈ సినిమాతో నైనా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.







