టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు.హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.
మునుగోడు ఉపఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అసహ్యంగా మార్చాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.రెండు పార్టీలు పోటాపోటీగా ఓటుకు రూ.30 నుంచి రూ.40వేలు పంచుతున్నాయని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని కేసీఆర్ దేశమంతా తనదే అంటున్నారని ఎద్దేవా చేశారు.బీజేపీ, టీఆర్ఎస్ లది మిత్ర భేదమే కానీ.శత్రు భేదం కాదని చెప్పారు.మునుగోడులో కాంగ్రెస్ పార్టీనే గెలుపు సాధిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.







